Thursday, January 23, 2025

కెనడాలో 20 లక్షల మంది భారతీయులు.. ఐటి ఉద్యోగులు రెండు లక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పలువురు భారతీయ ఐటి యువత కెనడాకు వెళ్లి స్థిరనివాసం దిశలో ఉంది. ఓ అంచనా ప్రకారం కెనడాలో ఐటి పరిశ్రమకు సంబంధించి అత్యధికంగా విదేశీ ఉద్యోగులలో ఇండియన్లే ఉన్నారు. ఎప్రిల్ 222 నుంచి ఈ ఏడాది మార్చి వరకూ దాదాపు 15వేల మంది వరకూ ఇండియన్ ఐటి యువత అక్కడికి వెళ్లినట్లు టెక్నాలజీ కౌన్సిల్ సర్వేలో వెల్లడైంది. ఇక పలుస్థాయిల్లో కెనడాకు ఉద్యోగాలపై వసల వెళ్లిన వారి సంఖ్య 2020 నుంచి మూడింతలు అయింది. 2022లో 118,095 మంది భారతీయులు కెనడాలో శాశ్వత నివాసం ఏర్పర్చుకున్నారని వెల్లడైంది. ఈ పరిణామంతో కెనడాలో ఇప్పుడున్న భారతీయ వలసదార్ల సంఖ్య దాదాపు రెండు మిలియన్లు చేరి ఉంటుంది. దౌత్య సంబంధాలు బెడిసికొట్టిన దశలో కెనడాలో భారతీయుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News