Monday, December 23, 2024

పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారులో పట్టుబడ్డ రూ.20 లక్షలు

- Advertisement -
- Advertisement -

20 lakh seized from car at Pantangi toll plaza

యాదాద్రి: జిల్లాలోని చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఓ కారులో రూ.20 లక్షలు పట్టుబడ్డాయి. శనివారం ఉదయం టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వస్తున్న కారులో డబ్బును గుర్తించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించి పత్రాలను చూపించకపోవడంతో డబ్బును, కారును పోలీసులు సీజ్‌ చేశారు. డబ్బును తరలిస్తున్న అభిషేక్‌ అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News