Saturday, November 23, 2024

జపాన్ లో 155 సార్లు భూప్రకంపనలు… 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

టోక్యో: కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జపాన్‌లో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం నుంచి దాదాపుగా 155 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సునామీ వస్తుందని హెచ్చరికలు జారీ చేసినప్పటికి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సునామీ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. నోటో ప్రాంతానికి 300 కిలో మీటర్ల దూరంలో భూ కంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News