- Advertisement -
హైదరాబాద్ లో నివాసం ఉండే సందీప్, స్నిగ్దబసుల కూతురు దాసరి సాయి అలంక్రిత 5 కిలోల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. చిన్నప్పటి నుంచి ఇంట్లోని వస్తువులను అవలీలగా పైకి ఎత్తి అందర్ని అబ్బుర పరుస్తుంది. దీంతో అతి చిన్న వయసులో ఎక్కువ బరువు ఎత్తిన బేబీగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరును నమోదు చేసుకుంది. ఏడాది వయస్సులోనే ఏడాది వయసు ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న టూ లీటర్స్ వాటర్ బాటిల్ ని సాయి అలంకృత అవలీలగా ఎత్తుకుని నడిచింది. అప్పటి నుంచి పాపలోని స్పెషల్ ట్యాలెంట్ ని తల్లిదండ్రులు గమనిస్తూ ప్రోత్సహించారు. ఈ ఏడాది సమ్మర్ లో 4.2 కేజీల బరువు ఉన్న వాటర్ మిలాన్ ని పదిహేడు నెలల వయస్సులో ఎత్తింది, ఇప్పుడు 20 నెలల వయస్సులో 5 కేజీల బరువును ఎత్తడంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది.
- Advertisement -