న్యూఢిల్లీ: భారత్ లో బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో స్ట్రెయిన్ కేసులు సంఖ్య 58కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 20 కొత్త కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో గుర్తించిన వీరందరినీ ప్రస్తుతం క్వారంటైన్లలో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. వారి కాంటాక్ట్ లందరినీ ఐసోలేషన్ లో ఉంచారు. కొత్త వైరస్ శాంపిల్స్ అన్నీ పూనేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ వైరాలజీకి తరలించి పరీక్షిస్తున్నారు. నవంబర్ 25 నుండి 2020 డిసెంబర్ 23 వరకు సుమారు 33,000 మంది ప్రయాణికులు యుకె నుండి వివిధ భారతీయ విమానాశ్రయాలలో దిగారు.
దీంతో భారత ప్రభుత్వం డిసెంబర్ 23 నుండి యునైటెడ్ కింగ్‌డమ్ నుండి విమాన ప్రయాణాన్ని నిలిపివేసింది. “ఈ వ్యక్తులందరినీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో ఒకే గదిలో ఉంచారు. వారి దగ్గరి పరిచయాలు ఉన్న వారిని కూడా క్వారంటైన్ లో ఉంచారు. సహ ప్రయాణికులు, కుటుంబ పరిచయాలు, ఇతరుల కోసం సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నారు. ఇతర నమూనాలపై జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోంది. ”అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్‌లలో కొత్త యుకె వైరస్ విజృంభణ కొనసాగుతోంది.
20 more in India test positive for new UK strain