Monday, December 23, 2024

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపొయిన 20 మంది నక్సల్స్

- Advertisement -
- Advertisement -

సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో శనివారం 20 మంది నక్సలైట్లు అధికారుల ముందు లొంగిపొయ్యారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తెలియచేశారు. సరెండర్ అయిన మావోలలో ఐదుగురు మహిళలు ఉన్నారు. సుక్మా జిల్లా తీవ్రస్థాయి నక్సల్ ప్రభావిత ప్రాంతంగా రగులుతోంది. సుక్మా జిల్లా ప్రధాన కేంద్రంలో వీరు లొంగిపోయినట్లు ఎస్‌పి కిరణ్ చవాన్ తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతంలోని డొల్లతనం, అమానుష తీరుతెన్నులతో తాము విసిగిపోయినట్లు , సరెండర్ నిర్ణయం తీసుకున్నట్లు వీరు ఏకరువు పెట్టుకున్నారని ఈ నేపథ్యంలో కిరణ్ చవాన్ వివరించారు. ఇప్పుడు లొంగిపోయిన వారిలో స్థానిక నక్సల్స్ దళం డిప్యూటీ కమాండర్ ఉయికా లఖ్మా కూడా ఉన్నారు.

ఇతరులు కూడా దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూరీ సంఘటన్ లో చురుకైన సభ్యులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారేనని జిల్లా పోలీసు అధికారి తెలిపారు. కామ్స్, చెత్నా నాట్యమండలి వంటి నక్సల్స్ అనుబంధ సంస్థలకు చెందిన వారు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. వీరి సరెండర్ విషయంలో జిల్లా పోలీసు విభాగం , సిఆర్‌పిఎఫ్ దళాలు కీలకమైన నిర్మాణాత్మక పాత్ర పోషించాయని ఎస్‌పి చెప్పారు. నక్సలైట్లు తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసేందుకు జిల్లా పోలీసు విభాగం తలపెట్టిన పునరావాస కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పున నర్కోమ్ ( నూతన అధ్యాయం, వినూత్న ఆరంభం) పథకంలో భాగంగా వీరు సరెండర్ అయినట్లు ఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News