Monday, January 13, 2025

టాప్ 500 గ్లోబల్ కంపెనీల్లో 20 భారతీయ సంస్థలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచంలో 500 అత్యంత విలువైన కంపెనీల్లో 20 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. గత సంవత్సరంలో ఎనిమిది కంపెనీల నుంచి ఇప్పుడు 20కి భారతీయ కంపెనీల సంఖ్య పెరిగింది. ఈ మేరకు హురూన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ 2022 హురూన్ గ్లోబల్ 500 నివేదికను విడుదల చేసింది. జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా నిలిచింది. 202 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ కంపెనీ 34వ స్థానంలో ఉంది. 2.4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో యాపిల్ కంపెనీ ప్రపంచంలో నంబర్ వన్ కంపెనీగా నిలిచింది.

ఆ తర్వాతి స్థానంలో 1.8 ట్రిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ నిలిచింది. హురూన్ ఇండియా చైర్మన్, చీఫ్ రిసెర్చర్ రూపర్ట్ హూగెవర్ఫ్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం హురూన్ గ్లోబల్ 500 కంపెనీల మొత్తం విలువలో 11 ట్రిలియన్ డాలర్లు నష్టపోగా, గతంతో పోలిస్తే 7 బిలియన్ డాలర్లు ముందే ఉంది. ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) 139 బిలియన్ డాలర్ల విలువతో భారతదేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా జాబితాలో నిలిచింది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ నాలుగు కంపెనీలు టాప్ 500లో చోటు దక్కించుకున్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, 63 బిలియన్ డాలర్ల విలువ కల్గిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి.

టాప్ 10లో కంపెనీలు

టాప్ 10లో ఉన్న గ్లోబల్ కంపెనీల్లో ఆల్ఫాబెట్, అమెజాన్, టెస్లా, బర్క్‌షైర్ హాత్‌వే, ఝాన్సన్ అండ్ ఝాన్సన్, ఎక్సాన్ మొబిల్ ఉన్నాయి. జాబితాలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌కు చెందిన 104 సంస్థలు ఉండగా, ఈ సెక్టార్ పెద్ద వాటాను కల్గివుంది. టాప్ 10లో యునైటెడ్ హెల్త్ గ్రూప్, వీసా వంటి రెండు ఆర్థిక సంస్థలు ఉన్నాయి. 2021లో మీడియా, ఎంటర్‌టైన్మెంట్ సెక్టార్ సంస్థలు అత్యధికంగా 2.4 ట్రిలియన్ డాలర్లను కోల్పోయాయి. మెటా ప్లాట్‌ఫామ్ విలువ గతేడాదిలో 618 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News