Tuesday, December 17, 2024

కల్తీ మద్యం కాటుకు ఇరవై మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో మరోసారి కల్తీమద్యం కాటేసింది. మోతీహారి జిల్ల లక్ష్మీపూర్, పహార్‌పూర్, హర్సిద్ధి బ్లాకులలో శుక్రవారం రాత్రి మద్యం సేవించిన కొంతమంది పరిస్థితి విషమించింది. ఇప్పటివరకు దాదాపు 20 మంది మృతి చెందగా, మరో అరడజను మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కల్తీమద్యంతో కూడిన ట్యాంకును మోతీహారీకి తీసుకు వచ్చి స్థానికులకు పంపిణీ చేశారని, ఇదే ఈ దుర్ఘటనకు దారి తీసిందని స్థానిక వర్గాలు చెప్తున్నాయి. కాగా దీనిపై పోలీసులు కానీ, ఇతర అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

Also Read: అమిత్ షాకు థ్యాంక్స్ చెప్పిన కెటిఆర్

బీహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం 2016లోనే మద్యపాన నిషేధాన్ని విధించంది.అయినప్పటికీ రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ కల్తీ మద్యాన్ని తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాదిజనవరిలో కూడా సివాన్‌లో కల్తీమద్యం తాగి నలుగురు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మద్యాన్ని విక్రయించిన 16మందిని అరెస్టు చేశారు. గత ఏడాది బీహార్‌లోని ఛప్రా జిల్లాలో కల్తీమద్యం కారణంగా ఏకంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు.బ్లాక్‌లో కల్తీమద్యాన్ని విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

కాగా కల్తీమద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.తాగితే చస్తారని, మద్యం జోలికి వెళ్లవద్దని కరాఖండిగా ప్రకటించారు. అయినా రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలు ఆగకపోవడం ప్రతిపక్ష బిజెపికి నితీశ్‌పై దాడి చేయడానికి పెద్ద ఆయుధంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News