Monday, December 23, 2024

లారీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం నార్కట్ పల్లి శివారులో వేగంగా వచ్చిన ఆర్టీసి బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

20 People Injured in Road Accident in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News