Wednesday, January 22, 2025

వలస జాతుల్లో అంతరించే ప్రమాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒకచోట నుంచి మరోచోటికి వలస పోయే జాతులు ప్రతి ఐదింటిలో ఒక జాతి అంతరించిపోయే అంచున ఉంటోందని, ఈ మేరకు 44 శాతం జనాభా తగ్గిపోయే పరిణామం ఏర్పడిందని ఐక్యరాజ్య సమితికి చెందిన అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ స్థాయి వలస తెగల పై మొదటిసారి ఇటువంటి నివేదిక సోమవారం వెలువడడం గమనార్హం. ఈ పరిస్థితి జలపర్యావరణ వ్యవస్థలో మరీ అధ్వాన్నంగా ఉందని నివేదిక వెల్లడించింది. వలస పోయే మత్స సంతతిలో 97 శాతం అంతరించిపోయే ప్రమాదంలో ఉందని, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసెస్ (సిఎంఎస్) జాబితాలో సంరక్షణ కోసం చేర్చడమైందని పేర్కొంది.

వలస పోయే జాతులను సంరక్షించుకోడానికి, అభివృద్ధి చేయడానికి ఈ మేరకు దేశాలన్నిటినీ భాగస్వామ్యం చేసి తగిన చర్యలు చేపట్టేలా ప్రోత్సహించడానికి 1979 లో సిఎంఎస్ ఏర్పాటైంది. ఉజ్బెకిస్థాన్ లోని సమర్‌కండ్‌లో సిఎంఎస్ 14 వ సదస్సులో ఈ నివేదికను ఆవిష్కరించారు. ఈ సదస్సులో మొదటి అనుబంధంలో చేర్చిన 82 శాతం తెగలు అంతరించి పోయే ప్రమాదంలో ఉన్నాయని, 76 శాతం జనాభా క్షీణించే దశలో ఉందని నివేదిక పేర్కొంది. వలస తెగల్లో ముఖ్యంగా పక్షులు, చేపల్లో ప్రపంచ వ్యాప్తంగా 399 తెగలు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని, అయితే ఈ సిఎంఎస్ నివేదికలో వాటిని ఇంకా చేర్చలేదని సిఎంఎస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆర్మీ ఫ్రాయెంకెల్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News