- Advertisement -
న్యూయార్క్ : మరో అమెరికా కంపెనీ ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. ఐటి సంస్థ యాహూ తన సిబ్బందిలో దాదాపు 20 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. 2023 ముగింపు నాటికి ఈ తొలగింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీలో మొత్తం 10 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 1600 మందిపై వేటు పడనుందని యాక్సియోస్ నివేదిక పేర్కొంది.
- Advertisement -