Sunday, December 22, 2024

20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం: ఒక స్మగ్లర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -
20 red sandalwood logs seized in Seshachalam forest
మరో కేసులో ఇద్దరు చొరబాటు దారులు పట్టివేత

హైదరాబాద్: శేషాచలం అటవీ ప్రాంతం అన్నదమ్ముల బండ 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడం తో పాటు ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా చంద్రగిరి మండలం చామల అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఇద్దరు చొరపాటు దారులను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి టీమ్ లోని ఆర్ ఎస్ ఐ లింగాధర్ బృందం శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేపట్టింది. దీనిపై ఎస్పీ మేడా సుందరరావు మాట్లాడుతూ మంగళవారం తెల్లవారుజామున అన్నదమ్ముల బండ వద్దకు చేరుకున్నారని తెలిపారు. అక్కడ కొంతమంది భుజాలపై ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించినట్లు తెలిపారు. వారిని చుట్టుముట్టే లోపు దుంగలు పడవేసి పారి పోయారని చెప్పారు.

అయితే వారిలో ఒకరిని పట్టుకోగలిగారని, అతనిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా జవ్వాది మలై కు చెందిన రామ కృష్ణ (30) గుర్తించామని తెలిపారు. అక్కడ 20 ఎర్రచందనం దుంగలు లభించాయని, అవి సుమారు టన్ను బరువు ఉంటుందని, వాటి విలువ సుమారు 70 లక్షల రూపాయలు ఉండవచ్చునని తెలిపారు. ఈ కేసును సి ఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా చంద్రగిరి మండలం చామల రేంజ్ అటవీ ప్రాంతంలో కి చొరబడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసికున్నట్లు చేప్పారు. వారి దగ్గర గొడ్డలి, ఇతర బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిని తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన రాజేంద్ర (35), పెరుమాళ్ (42) గా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసును ఎస్ ఐ మోహన్ నాయక్ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు డీఎస్పీ మురళీధర్, సిఐలు చంద్రశేఖర్, రామకృష్ణ, ఆర్ ఐ సురేషకుమార్ రెడ్డి, ఎఫ్ ఆర్ ఓ లు ప్రసాద్, ప్రేమ, ఆర్ ఎస్ ఐ లింగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News