Wednesday, January 22, 2025

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ఇసుక లారీ… 20 గొర్రెల మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఇసుక లారీ అదుపుతప్పి గొర్రెలపైకి దూసుకెళ్లడంతో 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో జరిగింది. కాట్నపల్లి ప్రధాన రాజీవ్ రహదారిపై మేకల రాజేందర్ గొర్ల మందపై ఇసుక దూసుకెళ్లడం జరిగింది. ఈ ప్రమాదంలో మేకల రాజేందర్ 20 గొర్ల కు పైగా చనిపోయాయి. ఈ ప్రమాదానికి కేవలం ఇసుక అక్రమ రవాణా, హెవీ లోడ్ ఏ కారణమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు. మేకల రాజేందర్ కి జరిగిన నష్టానికి నష్టపరిహారాన్ని అందించించాలి అని చింతకుంట విజయరమణ రావు డిమాండ్ చేశారు. మానేరు నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని విజయరమణరావు ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News