Friday, December 27, 2024

దేశంలో మూడేళ్లలో 20 వేల ఎంఎస్‌ఎంఇల మూసివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోగత మూడేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మూతపడ్డాయని కేంద్ర సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2020 జులై నుంచి 2023 మార్చి మధ్యలో దేశంలో 19,687 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని,

గత ఏడాది లోనే 13, 290 పరిశ్రమలు మూత పడ్డాయని వివరించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారం లోకి వచ్చిన మోడీ సర్కారు , ఉపాధి సంగతి అటుంచితే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. నోట్ల రద్దు, జిఎస్‌టి ప్రభావం నుంచి ఎంఎస్‌ఎంఈలు ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం నుంచి కూడా తగిన సహకారం లభించనందునే ఎంఎస్‌ఎంఈలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News