- Advertisement -
నోయిడాలోని సెక్టార్ 63లోని వస్త్ర కర్మాగారంలో శనివారం బాయిలర్ పేలి కనీసం 20 మంది కార్మికులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం నోయిడాలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినట్లు కూడా వారు తెలిపారు. సెక్టార్ 63 పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అవదేశ్ పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘సెక్టార్63, బ్లాక్ సి 122లోని ఓ వస్త్ర కర్మాగారంలోని స్టీమ్ బాయిలర్‌లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది, దీని వల్ల కనీసం 20 మంది కార్మికులు గాయపడ్డారు’ అన్నారు. కాగా ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
- Advertisement -