అహ్మదాబాద్: ఓ మహిళతో ఇద్దరు యువకులు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఒకరి ప్రాణం తీసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం మాధవపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాహిర్ సంధి(17), ఫిరోజ్ మిస్త్రీ (20) అనే యువకులు ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీంతో ఇద్దరు మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. మిస్త్రీ కత్తి తీసుకొని తాహిర్ ఇంటికి వెళ్లాడు. మిస్త్రీ నుంచి తప్పించుకోవడానికి తాహిర్ ఇంట్లో నుంచి రోడ్డుపై పరుగులు తీశాడు. కానీ అతడిని వెంబడించి రోడ్డు పై కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తాహిర్‌ను తల్లి పర్వీన్ బానో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ తాహిర్ ను చనిపోయాడు. తాహిర్ సోదరుడు సాహిద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మిస్త్రీని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మహిళతో వివాహేతర సంబంధం…. ప్రాణం తీసిన స్నేహితుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -