తీర్పు చెప్పిన కోర్టు
హైదరాబాద్: బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. అబిడ్స్‌కు చెందిన మహ్మద్ చోటు నగరంలో భిక్షమెత్తుకుంటూ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తాడు. బాలిక తల్లిని భర్త వదిలివేయడంతో అడుక్కుని బాలికను పోషిస్తోంది. తన సోదరుడితో కలిసి అబిడ్స్ పరిసరాల్లో భిక్షమెత్తుకుని నాంపల్లి ఫుట్‌పాత్‌పై నిద్రిచేంది. ఈ క్రమంలోనే తన సోదరుడితో పాటు భిక్షమెత్తుకునే మహ్మద్ చోటు(52) నవంబర్,23,2021న రాత్రి సమయంలో నాంపల్లి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో సాక్షాలను ప్రవేశపెట్టడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించింది. ఇన్స్‌స్పెక్టర్ గోపి, ప్రసాదరావు దర్యాప్తు చేశారు.