Sunday, December 22, 2024

మైనర్ బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ళ జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: మైనర్ బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన ఒక వ్యక్తికి స్పెషల్ సెషన్ జడ్జి 20 ఏళ్ళ జైలు శిక్ష, ఎనిమిది వేల రూపాయల అపరాధ రుసుం విధించింది. చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇన్‌స్పెక్టర్ ఎం.ఎ.జావీద్ తెలిపిన ప్రకారం… చాం ద్రాయణగుట్ట పూల్‌బాగ్‌కు చెందిన సెల్స్‌మెన్ షేక్ ఇస్మాయిల్ (21) 2016 ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాం తంలో తమ పక్కింట్లో ఉండే ఏడేళ్ళ బాలుడిని తీసుకువెళ్లి ఆ బాలుడిపై లైగింక దా డికి తెగబడ్డాడు.

మరుసటి రోజు ఈ విష యం తెలుసుకున్న బాధితుడి తం డ్రి 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం కేసును విచారించిన ఫోక్సో యాక్ట్ -2012, స్పెషల్ సెషన్ జడ్జి టి.అనిత తుది తీర్పును వెలువరించారు. నిందితుడు షేక్ ఇస్మాయిల్‌కు 20 ఏళ్ళ జైలుశిక్ష, ఎనిమిది వేల రూపాయల అపరాధ రుసుం విధించారు. నిందితుడిని జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News