20 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ స్థాపించి . స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత మన సిద్దిపేట దక్కింది..
కొత్త తరం నాయకత్వాన్ని , యువతను ప్రోత్సహించాలి..
10 రోజుల్లో పార్టీ కమిటీలు పూర్తి చేయాలి…
ఐదు మండలాలకు ఎన్నికల పరిశీలకులు, పట్టణంలో ఐదుగురితో సమన్వయ కమిటీ ఏర్పాటు..
పార్టీ కమిటీల నిర్మాణాలపై నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకుల తో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్ రావు….
హైదరాబాద్: టిఆర్ఎస్ ఆవిర్భావం..తెలంగాణ ఆవిర్భావం.. స్వరాష్ట్రంలో అభివృద్ధి సాధించి పెట్టిన ఘనత మన సిద్దిపేట కు ఉంది అని ముఖ్యమంత్రి కెసిఆర్ , టిఆర్ఎస్ పార్టీకి పురిటి గడ్డ.. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసుకొని 14 ఏళ్ల పోరాటానికి స్పూర్తినిచ్చిన.. నాటి ఉద్యమానికి.. నేటి అభివృద్ధి కి దీక్సుచి మన సిద్దిపేట అని.. టిఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్ళు అయిన సందర్భంగా పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ఆదేశాలకు పార్టీ పునర్నిర్మాణం చేపట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ నెల వరంగల్ లో విజయ గర్జన సందర్భంగా కమిటీలు వేసుకోవడం జరిగిందని, ఇటీవల హుజురాబాద్ ఎప ఎన్నికల బాధ్యతలో ఉండటం వలన పార్టీ ఈ సమయంలో వేడుక చేసుకోవడం జరుగుతోందన్నారు. రాబోయే 10 రోజుల్లో అన్ని గ్రామాల పార్టీ కమిటీల, మండల కమిటీలు, పట్టణములోని వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కమిటీల 10 రోజుల్లో పూర్తి కావాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి హరీష్ రావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ ఆవిర్భావం అయి ద్విదశాబ్ది అవుతన్న సందర్భంగా పార్టీ కమిటీల పునర్నిర్మాణం చేపట్టామని, అందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గ కమిటీలు కూడా వేయబోతునట్లు చెప్పారు. గ్రామ, మండల పట్టణ కమిటీలు పటిష్టంగా వేయాలని, కొత్త నాయకత్వం, యువతని ప్రోత్సాహించాలని చెప్పారు. వచ్చే 10 రోజులో కమిటీలు అన్ని పూర్తి చేయాలని చెప్పారు. మండలాల వారిగా ప్రజాప్రతినిధులతో సమన్వయ కమిటీ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఐదు మండలాలకు ఐదుగురిని పరిశీలకులుగా నియమించామన్నారు.
సిద్దిపేట అర్భన్ : మారేడ్డి రవీందర్ రెడ్డి సూడా చైర్మన్ , సిద్దిపేట రూరల్ వంగ నాగిరెడ్డి జిల్లా రైతు బంధు చైర్మన్, చిన్న కోడూరు మండలం పాల సాయి రామ్ మార్కెట్ కమిటీ చైర్మన్ , నంగునూర్ మండలం మూర్తీ బాల్ రెడ్డి , నారాయణ రావు పేట మండలం కూర మాణిక్య రెడ్డి ఎంపిపి, మండలాల వారిగా సమన్వయ కర్తలుగా ఏ మండలంలోని ఆ మండలం ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు 10 మంది చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..
పటిష్టంగా గ్రామ కమిటీల నిర్మాణం చేపట్టాలి..
టిఆర్ఎస్ ప్రభుత్వం లో అన్ని వర్గాలకు సిఎం కెసిఆర్ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా టిఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన ఉందని, ఆదిశగా టిఆర్ఎస్ పార్టీ లో అందరిని భాగస్వామ్యం చేయాలని సూచించారు.. ముఖ్యంగా కొత్త తరం, యువత ను ప్రోత్సాహించాలని ప్రతి కమిటీలో మహిళలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు.. గ్రామ గ్రామన పార్టీ గ్రామ కమిటీలు.. అనుబంధ కమిటీలు పటిష్టంగా వేయాలని సూచించారు.. కమిటీ వేసి జెండాలను వేయాలని అన్ని కమిటీలు వేశాక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని మండల కమిటీలు వేద్దామని హరీష్ రావు తెలియజేశారు.
పట్టణ వార్డు కమిటీల ఏర్పాటు కు ఐదుగురితో సమన్వయ కమిటీ ఏర్పాటు..
పట్టణంలో అన్ని వార్డుల్లో కమిటీలు నిర్వహించాలని మంత్రి సూచించారు.. పట్టణములోని వార్డు కౌన్సిలర్స్, ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు.. 10 రోజుల్లో కమిటీ పూర్తి చేయాలని చెప్పారు.. ప్రతి రెండు వార్డు లకు ఒకరు చొప్పున పరిశీలకులు ఉంటారని, ఈ పట్టణ కమిటీ, వార్డు కమిటీల నియామకంపై ఐదుగురు సమన్వయ కర్తలుగా ఉంటారని చెప్పారు. పూజల వెంకటేశ్వర్ రావు ( చిన్న) మచ్చ వేణు గోపాల్ రెడ్డి , లోక లక్ష్మీ రాజ్యం , మోహన్ లాల్, గుండు భుపేష్ లను నియమించారు..