- Advertisement -
కామారెడ్డి: వరద నీటిలో దాదాపుగా 200 పశువులు కొట్టుకపోయిన సంఘటన కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సంతాయి పేటలో ఇద్దరు వ్యక్తులు 200 పశువులను మేత కోసం గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. సాయంత్రం పశువులతో భీమేశ్వరం వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో పశువులు ఒడ్డుకు చేరలేక నానా ఇబ్బందులు పట్టాడియి 20 పశువులు చిన్నపాటి గాయాలతో బయటపడగా మిగిలిన పశువులు వరద ప్రవాహంలో కొట్టుకపోయాయి. గ్రామస్థులు అక్కడికి చేరుకొని 80 పశువులను రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో వరద వచ్చినట్టు నీటి పారుదల అధికారులు తెలిపారు.
Also Read: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త
- Advertisement -