Thursday, January 23, 2025

హిందూ మహా సముద్రం లోకి భారీ ఎత్తున చైనా పడవలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది తొలి అర్ధభాగం లోనే దాదాపు 200 చేపల వేట పడవలు చైనా నుంచి హిందూ మహా సముద్రం లోకి వచ్చాయని భారత నావికాదళం పేర్కొంది. ఈ నౌకలు చట్ట విరుద్ధమైనవని , ఎటువంటి సమాచారం సమాచారం ఇవ్వలేదని, రెగ్యులేటెడ్ కానివని వెల్లడించింది.భారత ఈఈజెడ్ (ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ ) సమీపంలో ఇవి చేపల వేట కొనసాగిస్తున్నాయని పేర్కొంది. ఉత్తర హిందూ మహా సముద్ర ప్రాంతం లోనే ఇవి అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పింది. ఓ ఆంగ్ల పత్రిక అడిగిన సమాచారం కింద ఈ వివరాలను వెల్లడించింది. చైనా నౌకలతోపాటు ఐరోపా దేశాల నౌకలు కూడా కొన్ని ఇక్కడకు వచ్చి చేపల వేట చేపడుతున్నాయని పేర్కొంది.

ఇటీవల కాలంలో డీప్‌సీ ఫిషింగ్ ట్రాలర్లు , ఇతర పడవల కారణంగా మొత్తంగా ఈ ప్రాంతంలో చైనా కదలికలు పెరిగాయి. చైనా తీరానికి దూరంగా ఇక్కడకు డీప్‌సీ ట్రాలర్లు రావడం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సముద్ర గర్భం పరిస్థితులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. 2015 నుంచి 2019 మధ్య 500 చైనా డీప్‌సీ ట్రాలర్లు ఇక్కడకు వచ్చాయి. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో చేపల వేట నిర్వహిస్తున్న చైనా పడవల్లో మూడో వంతుకు ఎటువంటి గుర్తింపు లేనట్టు సమాచారం. వీటికి తోడు రెండు పరిశోధన నౌకలు కూడా హిందూ మహా సముద్రంలో ఉన్నాయి. క్షిపణులను ట్రాక్ చేయగల సామర్ధం వీటికి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News