ఎల్బీనగర్: సీలేరు టూ ఆంధ్రప్రదేశ్ టూ మహారాష్ట్ర వయా హైదరాబాద్‌కు తరలిస్తున్న 200 కిలోల గంజాయి చౌటుప్పల్ పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ పోలీసులు , ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు సం యుక్తంగా దాడులు నిర్వహించి, ఆరుగురు అంతరాష్ట్ర ముథా సభ్యులను అరెస్టు చేసి, రిమాండుకు తరిలించారు. అరెస్టయిన ముఠా సభ్యుల నుంచి గంజాయితో పాటు రెండు కార్లు, ఆరు మొబైల్ ఫోన్‌లు, రెండు డూప్లికేట్ కార్ నెంబర్ ప్లేట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకోండ సిపి చౌహాన్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. పట్టుబడిన ముఠా సభ్యుల్లో మహారాష్ట్రకు చెందిన వివేక్ మోహన్‌రావు హవ్లే, గణేష్ మారుతీరావు దుమాల్, సచిన్ సురేష్ గాడే, సంతోష్ బహర్ బురాడి, సామ్రాట్ సురేంద్ర మానే, బిల్ అశోక్‌లు ఉన్నారన్నారు. ఎపికి చెందిన కేశవ్, మహారాష్ట్రకు చెందిన దత్తాలు పరారీలో ఉన్నారన్నారు. పట్టుబడ్డ ఆరుగురు ముఠా సభ్యులు గంజాయి వ్యాపారం చేసి బాగా సంపాదించవచ్చని ఆలోచించారు. దీంతో ఆరుగురు కలసి స్వీఫ్ట్ కారు ,మారుతి ఇర్టిగా కారులు తీసుకోని ఆంద్రప్రదేశ్ సీలేరుకు వెళ్లారన్నారు. ఎపి సీలేరుకు చెందిన కేశ్‌వ్ వద్ద గంజాయి కిలో రూ.3000లతో 200 కిలోల గంజాయిని కోనుగోలు చేశారని తెలిపారు. అదే గంజాయిని కిలో రూ.20 వేల చొప్పున మహరాష్ట్రకు చెందిన దత్తాకు సప్లయ్ చేయాలనుకున్నారన్నారు. గంజాయి కోనుగోలు చేసి, రెండు కార్లులో బయలుదేరారని, పంతంగి టోల్ గేట్ వద్ద చౌటుప్పల్, ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు.
200 కిలోల గంజాయి స్వాధీనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -