- Advertisement -
వాషింగ్టన్ : అమెరికా గురువారం ఇతర దేశాలకు 200 మిలియన్ టీకా డోసులను ఉచితంగా పంపిణీ చేసినట్టు ప్రకటించింది. అమెరికా స్వదేశ ప్రజలకు బూస్టర్ డోసు పంపిణీ చేస్తున్నప్పటికీ ప్రపంచ స్థాయి వ్యాక్సినేషన్ కాంపైన్‌కు మార్దదర్శకం కావాలని బైడెన్ ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్టు వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు పంపిణీ అయిన వాటిలో అమెరికా తన వద్ద ఉన్న మిగులు నిల్వలో 120 మిలియన్ పంపిణీ చేయగా, 2022 సెప్టెంబర్ నాటికి ఇతర దేశాలకు ఉచితంగా దానం చేయడానికి బైడెన్ ప్రభుత్వం 1 బిలియన్ డోసుల ఫైజర్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసింది.
- Advertisement -