Friday, November 15, 2024

‘పవర్’ఫుల్ పాలసీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 24/7 నాణ్యమైన విద్యుత్తును నిరంతరంగా ఇవ్వాలని, గృహ వినియోగానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటును సరఫరా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేగాక విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, కొనుగోళ్లు, విద్యుత్ సంస్థల ఆర్థ్ధిక పరిస్థితు లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి అత్యున్నతమైన పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇప్పటి వరకూ విద్యుత్ రంగంపై పక్కా పాలసీ లేకపోవడంతోనే అనేక అనర్థ్ధాలు జరిగాయని

ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో నిర్వహించిన ఉ న్నతస్థాయి సమీక్షలో స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో చేపట్టబోయే సంస్కరణలు, విద్యుత్ రంగం అభివృద్ధిపై తమ ప్రభుత్వం పక్కా ప్రణాళితో ముందుకు సాగుతుందని సీఎం తెలియజేశారు. ‘విద్యుత్ రంగంలో ఒకవైపు ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూ.. మరోవైపు ఆర్థ్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని పరిరక్షించుకొంటూ… ఇంకోవైపు సొంతగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్ధాన్ని పెంచుకొంటూ… విద్యుత్తు కొనుగోళ్లను త గ్గించుకొంటూ… ఇంకా వీలైతే పొరుగు రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్ముకునే స్థాయికి
చేరుకునే విధంగా అత్యంత పటిష్టమైన, ఆచరణయోగ్యమైన విద్యుత్ పాలసీని తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాం’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశంలో అధికారులకు స్పష్టం రాష్ట్రానికి సమగ్ర విద్యుత్ విధానం లేకపోవడం మూలంగా ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని సిఎం అన్నారు.

వివిధ రాష్ట్రాల విద్యుత్ వి ధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాత సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామని సిఎం ప్రకటించారు. విద్యుత్‌రంగ నిపుణులతో సైతం విస్తృతంగా సంప్రదింపులు నిర్వహిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట ప్రకారం, రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఇచ్చి తీరాలని స్పష్టం ఆరు గ్యారెంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం నుంచి ఒక్కో ఇంటికి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై (పిపిఎ) సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ఈ ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఇఆర్‌సి) నుంచి పొందిన అనుమతులు, ఒప్పందాలతో కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరలు… తదితర అంశాలు ఆ నివేదికలో ఉండాలని స్పష్టంగా ఆదేశించారు. ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, వాటిలోని అంశాలను కూడా తనకు నివేదించాలని, ఎక్కువ ధరను చెల్లించే విధంగా జరిగిన ఒప్పందాలకు దారితీసిన కారణాలను కూడా నివేదించాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్‌లో ఎక్కడైతే తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందో.. ఆ కంపెనీల నుంచే విద్యుత్‌ను కొనుగోలు చేయాలని సిఎం ఆదేశించారు. ఇప్పటివరకూ సరైన విద్యుత్ పాలసీని రూపొందించకపోవడంతోనే అనేక ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను సైతం ఆ నివేదికలోనే వివరించాలని కోరారు. ఇకపై బహిరంగ మార్కెట్‌లో ఎవ్వరు తక్కువ ధరకు విద్యుత్‌ను విక్రయిస్తున్నారో వారి వద్ద నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని సిఎం ఆదేశించారు.

అంతేగాక విద్యుత్ కొనుగోళ్లపైనే పూర్తిగా ఆధారపడకుండా సొంతగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు వీలుగా జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తగిన సూచనలు చేయాలని, రానున్న అనతికాలంలోనే విద్యుత్ కొనుగోళ్లు తగ్గిపోయాలని అధికారులను కోరారు. అందుకు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి సామర్థాన్ని పెంచుకోవడానికి ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉన్న అంశాలను పరిశీలించాలని, నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రాలను వాయువేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్ నిరంతర సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తుగా పటిష్ట చర్యలను చేపట్టాలని సిఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. జెన్‌కో ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి, ఇతర విద్యుత్ ఉత్పత్తి, ఇతర విద్యుత్ కపెంనీల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న వివరాలు, రాష్ట్రంలోని విద్యుత్ డిమాండ్,

కరెంటు సరఫరా పరిస్థితులు, డిస్కంల ఆర్ధిక పరిస్థితి, పనితీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుధీర్ఘంగా సాగిన ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌శాఖల మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News