- Advertisement -
జపాన్‌లో గత 30 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత అతిపెద్ద కార్చిచుచ వ్యాపించింది. దీంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు 4500 ఎకరాల్లో అటవీ సంపద కాలి పోయింది. ఈ కార్చిచ్చును మొదట బుధవారం గుర్తించారు. అప్పటికి 84 ఇళ్లు బూడిదయ్యాయి. ఆదివారం ఉదయం దాదాపు 4600 మందిని ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. 1200 ఇళ్ల లోని వారిని అత్యవసర వసతి ప్రదేశాలకు తరలించారు. దాదాపు 1700 మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు తరలించారు. సహాయక చర్యల కోసం విమానాలను కూడా రంగం లోకి దించారు.
- Advertisement -