Monday, December 23, 2024

రెండువేల నోట్లు 72 శాతం వెనకకు

- Advertisement -
- Advertisement -

ముంబై : రెండు వేల రూపాయల నోట్ల రద్దు ఉపసంహరణ రద్దు నిర్ణయంతో కదలిక ఏర్పడింది. నిర్ణయం తీసుకున్న నెలరోజుల్లో రూ 2000 నోట్లలో మూడింట రెండొంతులు పైగా వెనకకు వచ్చాయి. 72 శాతం మేర ఇవి వ్యవస్థలోకి చేరాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నరు శశికాంత దాస్ తెలిపారు. విస్మయకరమే అయినప్పటికీ క్లీన్ నోట్ల పాలసీలో భాగంగా ఆర్‌బిఐ మే 19వ తేదీన దేశంలోని రెండువేల రూపాయల నోట్ల రద్దు నిర్ణయం వెలువరించింది. వీటి విలువ మొత్తం మీద 3.62 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు.

రద్దయిన రెండు వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకూ మార్చుకునేందుకు వీలు కల్పించారు. అప్పటివరకూ చలామణిలో ఈ నోట్లు ఉంటాయని, అయినా ఇప్పటి నుంచే వీటిని బ్యాంకుల ద్వారా వేరే నోట్లలోకి మార్చుకునేందుకు వీలు కల్పించారు. ఈ క్రమంలో 72 శాతానికి పైగా ఈ నోట్లు రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థలోకి తిరిగి వచ్చిన విషయాన్ని ఆర్‌బిఐ గవర్నరు తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు రూ 2.41 లక్షల కోట్ల విలువైన రెండు వేలరూపాయల నోట్లు బ్యాంకుల్లో చేరాయి. ఈ మేరకు ఈ రద్దు అవుతోన్న నోట్ల మార్పిడి జరిగిందనేది నిర్థారణ అయింది. నోట్ల రద్దు పరిణామం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రతికూలత ఉండదని, స్వచ్ఛతకు ఇటువంటి ఆపరేషన్ అవసరం అని ఆర్‌బిఐ సంచాలకులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News