Monday, January 20, 2025

బుడుతల ఉడుత భక్తికి ముగ్దుడైన మంత్రి

- Advertisement -
- Advertisement -

 

సిద్ధిపేట న్యూస్: మంత్రి హరీష్ రావు చిన్నారుల మనసు దోచుకున్నారు. బావి తరం మాదే అంటూ తాము దాచుకున్న2000 రూపాయలను కైతా తరుణ్(4) అనే చిన్నారి బి ఆర్ ఎస్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపల్లి పెద్దమ్మ దేవాలయంలో తరుణ్ మంత్రి హరీష్ రావుకు అందించారు. బిఆర్ఎస్ పట్ల తనకున్న అభిమానానికి ముచ్చట పడ్డ మంత్రి స్వయంగా దాచుకున్న గల్లపెట్టె డబ్బును రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు అందిస్తానని తరుణ్ కు మంత్రి మాట ఇచ్చారు. ఆ బుడతలు ఉడుతా భక్తి గా ఇచ్చిన కిడ్డి బ్యాంక్ చూసి మంత్రి ఆశ్చర్య పోయారు. చిన్నారుల్లో సైతం ఇంతటి అభిమానం పై మంత్రి మంత్ర ముగ్దుడయ్యాడు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News