Monday, December 23, 2024

2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింజేయాలి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: డిఎస్‌సి 2003ఉపాధ్యాయులదంరికీ పాత పెన్షన్ విధనాన్నీ వర్తింప జేయాలని, కేంద్రం మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిఎస్‌సి 2003 ఉపాధ్యాయ నాయకులు సోమశేఖర్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఎల్లంకి డిగ్రీ కాలేజీలో ఓపిఎస్ విధనాన్నీ అమలు చేయాలని జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2004సెప్టెంబర్ 1వరకు సిపిఎస్ విధానంతో నోటిఫికేషన్ నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు అమలు చేయాలని కే్ర్ంద ప్రభుత్వం జారీ చేసిన మెమో 57ను తెలంగాణ రాష్ట్రంలో కూడ అమలు చేసి ఈ మెమో పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుల్స్, గ్రూప్ 2, ఇరిగేషన్ శాఖ ఉద్యోగులకు సిపిఎస్‌ను తక్షణమే రద్దు చేయాలన్నారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేష్‌లో 2004కు ముందు నోటీఫికేషన్‌ల ద్వారా నియామక ప్రక్రియ ముగించుకొని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వల్ల 2004సెప్టెంబర్1 తర్వాత ఉద్యోగంలో చేరడంతో ఓపిఎస్ విధనాంలోకి నెట్టబడ్డారాన్నరు. ఈ విధంగా పాత పెన్షన్ నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓపిఎస్‌ను అమలు చేస్తూ కేంద్రం మెమో 57ను జారీ చేసిందన్నారు. ఈ మెమోను తెలంగాణ రాష్ట్రంలో కూడ అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్నీ కోరారు. ఉపాధ్యాయుల నుండి వివరాలు సేకరించి 2 ఏళ్లు గడుస్తున్న ఇప్పటి దాకా ఉత్తర్వులు మంజూరు చేయడంలో పూర్తిగా నిర్లక్షంగా వహిస్తోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, గోవర్దన్, దామోదర్, సుధాకర్ గీత తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News