Wednesday, January 22, 2025

రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న 2008 డిఎస్‌సి అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి 2008 డిఎస్‌సి అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఎంను అభ్యర్థులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. 2008 డిఎస్‌సి నోటిఫికేషన్‌లో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. 2008 డిఎస్‌సి అభ్యర్థులను ఆరు వారాల్లో భర్తీ చేయాలని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వం తమపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News