Saturday, December 21, 2024

ధర్మస్థల క్షేత్రంలో 201 జంటలకు వివాహ బంధం..

- Advertisement -
- Advertisement -

మంగళూరు: కర్ణాటకలోని శ్రీ క్షేత్ర ధర్మస్థలంలో గోధూళి ముహూర్తంలో 51వ సామూహిక వివాహ వేడుక సందర్భంగా బుధవారం 201 జంటలకు పెళ్లి జరిగింది. మంజునాథేశ్వరకు ప్రార్థనలు చేసిన తరువాత ఈ జంటలు ఊరేగింపుగా బయలుదేరి మ్యారేజి హాల్‌కు చేరుకున్నారు. ధర్మస్థల ధర్మాధికారి, రాజ్యసభ సభ్యులు డి. వీరేంద్రహెగ్డే ఆయన భార్య హేమవతీ హెగ్డే ఈ నవదంపతులకు మంగళసూత్రాలు అందించారు. ముఖ్య అతిధిగా నటుడు దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరుల్లో 52 కులాంతర జంటలు, మరో 52 షెడ్యూల్డ్ కులాల జంటలు, 9 జంటలు కురుబ, వీరశైవ సామాజిక వర్గం వారు, 11 జంటలు షెడ్యూల్డ్ తెగల వారు ఉన్నారు. వీరిలో మూడు జంటలు కేరళకు చెందినవారు కాగా, ఒక జంట ఆంధ్రప్రదేశ్‌కు చెందినది. ఈ సందర్భంగా హెగ్డే మాట్లాడుతూ కొత్త దంపతులు సరైన సామరస్య జీవితాన్నిగడపాలని సూచించారు. మెహెందీ, వివాహాల పేరుతో మితిమీరిన ఖర్చులు చేయకుండా నివారించేలా అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News