Monday, December 23, 2024

ఆస్కార్‌కు మలయాళం బ్లాక్‌బస్టర్ ’2018’

- Advertisement -
- Advertisement -

ఆస్కార్ 2024 అవార్డుల కోసం మన దేశం నుండి మలయాళం బ్లాక్‌బస్టర్ ’2018’ సినిమా ఎంపికైంది. వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుకలో ఈ సినిమాను ‘ఉత్తమ అంతర్జాతీయ ఫిలిం’ కేటగిరీలో ఎంపిక చేశారు. ఈ మలయాళం సినిమాను 2018 కేరళ వరదల నేపథ్యంలో తీశారు. టోవినో థామస్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాకు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకుడు. రికార్డు కలెక్షన్లను సాధించింది ఈ సినిమా.

ఇక చెన్నైలో కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ మొత్తం 22 సినిమాలను చూసి వాటిలో నుంచి ఈ 2018 సినిమాను ఎంపిక చేశారని తెలిసింది. తెలుగు సినిమాలు దసరా, బలగం లాంటివి కూడా ఈ సినిమాతో పోటీ పడినా చివరికి ’2018’ ని ’ఉత్తమ అంతర్జాతీయ ఫిలిం’ కేటగిరీకి ఎంపిక చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News