రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగానికి 202122 బడ్జెట్‌లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది 19 శాతం అధికం. ఇందులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల పింఛన్లు కూడా కలిసి ఉన్నాయి. పింఛన్లకు రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు. పింఛన్ల మొత్తం పోగా, సైనిక విభాగానికి రూ.3.62 లక్షల కోట్లు కేటాయించినట్టు. వీటిలో రూ.1.36 లక్షల కోట్లు ఆయుధాలు, యుద్ధ విమానాలు,నౌకలు, ఇతర రక్షణ సామగ్రి కొనుగోలు కోసం పక్కకు పెట్టనున్నారు. కొత్తగా 100 సైనిక పాఠశాలల ఏర్పాటుకు ఆర్థికమంత్రి ప్రతిపాదించడం పట్ల
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రంగానికి 202021లో రూ.4.71 లక్షల కోట్లు కేటాయించారు.
హోంశాఖకు రూ.1.66 లక్షల కోట్లు
జనాభా లెక్కలకు రూ.3700 కోట్లు
కేంద్ర హోంశాఖకు ఈ బడ్జెట్‌లో రూ.1,66,546.94 కోట్లు కేటాయించారు. వీటిలో 1,03,802.62 కోట్లు సిఆర్‌పిఎఫ్,
బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్ దళాల కోసం ఖర్చు చేయనున్నారు. 2021 జనాభా లెక్కల కోసం రూ.3768.28 కోట్లను కేటాయించారు. హోంశాఖకు కేటాయించినవాటిలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్‌కు రూ.30,757 కోట్లు, లడఖ్‌కు రూ.5,958 కోట్లు కేటాయించారు.
రోదసీ విభాగానికి రూ.13,949 కోట్లు
రోదసీ విభాగానికి ఈ బడ్జెట్‌లో రూ.13,949.09 కోట్లు కేటాయించారు. 202021 బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది
రూ.4449 కోట్లు అధికం. గత బడ్జెట్‌లో మొదట రూ.13,479.47 కోట్లు కేటాయించి, ఆ తర్వాత రూ.9500 కోట్లకు సవరించారు. 201920 బడ్జెట్‌లో ఈ రంగానికి రూ. 13,017.61 కోట్లు కేటాయించారు.
సిబిఐకి రూ.835 కోట్లు
కేంద్ర దర్యాప్తు విభాగానికి రూ.835.39 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో సిబిఐకి రూ.835.75 కోట్లు కేటాయించారు. ఈసారి ఈ మొత్తాన్ని స్వల్పంగా తగ్గించారు. గతేడాది సిబిఐ ఆధ్వర్యంలో రూ.67,000 కోట్ల బ్యాంక్
మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.
సిబ్బంది శిక్షణ విభాగానికి రూ. 257 కోట్లు
కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ విభాగానికి రూ.257.35 కోట్లు కేటాయించారు. ఉన్నతాధికారుల శిక్షణ, ప్రాథమిక వసతుల కల్పనకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఇందులో రూ.178.32 కోట్లను ముస్సోరీలోని నేషనల్ అకాడమీ, ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్, తదితర శిక్షణ సంస్థల్లో వసతుల మెరుగుదలకు ఖర్చు చేయనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం పరీక్షలు నిర్వహించే స్టాఫ్
సెలెక్షన్ కమిషన్‌కు రూ.382.59 కోట్లు కేటాయించారు.
జల్‌జీవన్ మిషన్‌కు రూ.2.87 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో జల్‌జీవన్ మిషన్ ద్వారా 2.86 కోట్ల కుటుంబాలకు ట్యాప్ వాటర్ కనెక్షన్ల కోసం రూ.2,87,000 కోట్లు కేటాయించారు. ఐదేళ్ల కాలంలో ఈ లక్షాన్ని సాధించాలని నిర్దేశించారు. దేశంలోని 4,378 పట్టణాల్లోని స్థానిక సంస్థలకు ఈ నిధుల్ని కేటాయిస్తారు. ఇందులో 500 అమృత్ నగరాలు కూడా ఉన్నాయి. ఈ నగరాల్లో ఐదేళ్ల కాలానికి లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం ఈ నిధుల్లోంచి కొంత ఖర్చు చేయనున్నారు. జల్‌జీవన్ మిషన్‌ను 2019లో ఏర్పాటు చేశారు. 2024 వరకల్లా గ్రామీణ ప్రాంతాల్లో ట్యాప్ వాటర్ కనెక్షన్ల కోసం దీనిని ప్రారంభించారు. ఇప్పటివరకు మూడు కోట్ల ట్యాప్ కనెక్షన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ పథకాన్ని పట్టణాలకు విస్తరిస్తున్నారు.