- Advertisement -
ఉమ్మడి అభ్యర్థి ఖరారుకు 17న భేటీ
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థి గురించి చర్చించేందుకు వచ్చే ఆదివారం (జులై 17) ప్రతిపక్షాలు సమావేశం కానున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఆదివారం సమావేశమై ఉప రాష్ట్రపతి పదవికి తమ ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు చర్చలు జరపనున్నాయని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం నాడిక్కడ తెలిపారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనున్నది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు జులై 19 గడువు తేదీ. ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనున్నది.
- Advertisement -