Wednesday, January 22, 2025

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే ఆఖరివి..

- Advertisement -
- Advertisement -

మైసూరు: కర్నాటక అసెంబ్లీకి 2023లో జరిగే ఎన్నికలే తనకు చివరివని, అయితే రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం ప్రకటించారు. శుక్రవారం తన స్వగ్రామం సిద్దరామనహుండిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరిస్తున్న సిద్దరామయ్య తెలిపారు. వరున, హున్సూరు, చామరాజ్‌పేట్, బదామి, కోలార్, హెబ్బల్, కొప్పల్, చాముండేశ్వరికి చెందిన పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తనను వారి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని, అయితే ఇంకా తాను తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన ఉత్తర కర్నాటకలోని బదామి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2023 Assembly Polls will be last to me: Siddaramaiah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News