తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్య భారత్ పూర్తిగా సన్నద్ధం కాలేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇతర జట్లు వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే బలమైన జట్లను తయారు చేసుకోగా ఆతిథ్య టీమిండియా మాత్రం ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా గెలుపు అవకాశాలన్నీ సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపైనే ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కెరీర్‌లో దాదాపు వన్డే ప్రపంచకప్ ఆడుతున్న వీరు ఎలాగైనా జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. యువ ఆటగాళ్లతో పోల్చితే ఫిట్‌నెస్‌లో కోహ్లి ఇప్పటికే ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈసారి అతను తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా కీలక బాధ్యతలు ఉన్నాయి. జట్టును ముందుండి నడిపించాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది. మరోవైపు హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలు కూడా జట్టుకు చాలా కీలకంగా మారారు. బుమ్రా, అయ్యర్, రాహుల్‌లు కోలుకుంటే టీమిండియాకు కాస్త సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. మొత్తం మీద సొంత గడ్డపై జరుగనున్న వరల్డ్‌కప్ టీమిండియాకు సవాల్‌గా మారిందనే చెప్పాలి.