Monday, December 23, 2024

ఏ ఆటగాడికి ఎంత ధరో తేలేది మరికాసేపట్లోనే!

- Advertisement -
- Advertisement -

మరికాసేపట్లో ఐపీఎల్ 17వ సీజన్ వేలం మొదలుకాబోతోంది. దుబాయ్ లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వేలం పాట మొదలువుతుంది. ఇండియా వెలుపల ఐపీఎల్ వేలం జరగడం ఇదే మొదటిసారి. మొత్తం 333 ఆటగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. వీరిలో 214 మంది భారత ఆటగాళ్లు కాగా మిగిలిన వారు విదేశీయులు. అన్ని ప్రాంచైజీలూ కలిపి 262 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాయి.

ఈసారి ఐపిఎల్ లో అత్యధిక ధర ఎవరికి పలుకుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్, అదే జట్టులోని పేస్ బౌలర్ స్టార్క్, న్యూజీలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రలపైనే అందరి దృష్టీ ఉంది. వీరికి ఐపీఎల్ లో భారీ ధర పలికే అవకాశం ఉంది. భారత ఆటగాళ్లలో ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్ లకు బాగా డిమాండ్ ఉంది. ముంబాయి జట్టుకు వెళ్లిపోయిన హార్దిక్ పాండ్యా స్థానాన్ని గుజరాత్ ఎవరితో భర్తీ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆటగాళ్ల కొనుగోలులో ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కూడా పాల్గొంటున్నాడు. ప్రమాదంలో గాయపడి చాలాకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న పంత్, ఐపీఎల్ లో సత్తా చూపించబోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News