Friday, November 22, 2024

మే 3నే మరో దారుణం.. పిల్లల తల్లిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇప్పుడు వెలిసిన సహాయక శిబిరాలలో మహిళల కన్నీటి గాధలు, వారిపై జరిగిన అత్యాచారాలుమరెన్నో వెలుగులోకి వస్తున్నాయి. మే 3వ తేదీన అర్థరాత్రి తరువాత మైతీల ఇళ్లను కుకీల బృందం తమ నిరసనల దశలో తగులపెట్టారు. ఈ దశలో ప్రాణాలు నిలబెట్టుకునేందుకు తాను తన ఇద్దరు పిల్లలు, ఓ బంధువు, వదినతో బయటకు వచ్చామని అల్లరిమూక తమపై దాడికి యత్నించగా తాను కిందపడినట్లు, తన బిడ్డలను తీసుకుని వదిన పారిపోయిందని, కిందపడ్డ తనను ఈ బృందం పట్టుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఈ 37 ఏండ్ల మహిళ తెలిపింది. మణిపూర్‌కు చెందిన అత్యంత కలోల్లిత ఛురాచంద్‌పూర్ జిల్లాకు చెందిన ఈ బాధితురాలు ఇప్పుడు తన పై జరిగిన అమానుష ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మణిపూర్‌లో మే 3వ తేదీనే ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, తరువాత సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అనాగరికం , క్రూరత్వానికి ప్రతీక అయింది. ఇంతకాలం తాను ఈ ఘటన గురించి ఫిర్యాదు చేయకపోవడానికి కారణం సమాజంలో తనను అంతా ఏవగించుకున్నట్లుగా చూస్తారనే అని, ఇప్పుడిప్పుడే బాధితురాళ్లు తమపై జరిగిన దారుణాల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉండటంతో తానూ ఈ క్రమంలో తన గోడు తెలియచేసుకున్నానని ఈ మహిళ తెలిపారు.

తాను ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అయితే తన బిడ్డల కోసం బతుకుతున్నానని తెలిపింది. ఈ మహిళ తనకు జరిగిన దారుణం గురించి ఈ సహాయక కేంద్రం వద్ద ఉండే స్థానిక పోలీసు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అప్పట్లో తన పిల్లలను తన వదిన కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్లింది. ఇప్పుడు సహాయక శిబిరంలో అంతా తలదాచుకుంటున్నామని, ఆ రోజు దుండగులు తన పిల్లలను మంటల్లో విసిరేసేవారని ఈ మహిళ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News