Monday, January 20, 2025

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్ట్ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినిమా ప్రమోషన్‌లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేస్తున్న విశేష కృషికి గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్ట్‌లో చోటు దక్కించుకుంది. ప్రముఖ తెలుగు చలన చిత్ర నటులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామరావు శత జయంతి సందర్భంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా, కార్యదర్శి వి.ఎస్.వర్మ నేతృత్వంలో 2023 ఎన్‌టిఆర్ లెజెండరీ నేషనల్ ఆవార్డ్ కార్యక్రమం పేరుతో 10 రాష్ట్రాలకు చెందిన 101 మంది ప్రముఖల సత్కరించడంలో కౌన్సిల్ చేసిన కృషికి గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో గుర్తింపు లభించింది ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను ఎప్‌టిపిఎస్ అధ్యక్ష కార్యదర్శులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు డాక్టర్ రాజీవ్ శ్రీవాస్తవ్, ఆకాన్షా షా సమక్షంలో ప్రముఖ చలన చిత్ర నటులు మాగంటి మురళీమోహన్ అందజేశారు.

ఈ సందర్బంగా ఎఫ్‌టిపిసి అధ్యక్షులు జంగా చైతన్య , పాకలపాటి వర్మలు మాట్లాడుతూ ఇండియన్ సినిమా , టూరిజం సౌబ్రాతృత్వ సంబంధాలను ప్రోత్సహించేందుకు గాను ఇటీవలే ఖాట్మండ్‌లో ఇండో నేపాల్ ఫిల్ ఫెస్టివల్‌ను నిర్వహించామని తెలిపారు. త్వరలోనే బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఎమిరేట్స్ తదితర దేశాల్లోసై ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు కార్యచరణను సిద్దం చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News