Wednesday, January 22, 2025

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం మెరుపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో2023 జనవరి నెలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చిన సూచీలో ఫ్రంట్ రన్నర్‌గా ఐదు స్టార్‌లతో రాజన్న సిరిసిల్ల (తెలంగాణ) ప్రథమ స్థానంలో నిలిచింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు ఫోర్ స్టార్‌తో బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలన (ఓడిఎప్) ప్లస్ కేటగిరీలో వంద స్కోరుతో తొలిస్థానంలో నిలిచి.. ఫిబ్రవరి ఒకటి నుంచి జిల్లా ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. అదే విధంగా ఖమ్మం జిల్లా త్రీ స్టార్ కేటగిరీలో దేశంలోనే తొలిస్థానం సాధించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఈ పథకం ద్వారా ఏటా అవార్డులు అందిస్తోంది. ఈ ఏడాది కేటగిరీల ఎం పికలో మార్పులు తీసుకొచ్చింది. 2023కు సం బంధించి ఇప్పటి వరకు ప్రతి నెలా గుర్తింపు ప్రక్రియను చేపట్టింది.

దీనిలో భాగంగా జనవరి 2023 లో బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలన (ఓడిఎప్) ప్లస్ కేటగిరీలో 83.09 స్కోరుతో ఖ మ్మం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్లు తాగునీ రు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నివాసాల్లో, సంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించడం, గ్రామాల్లో ఘన వ్యర్థాలు, స్వచ్ఛ భారత్‌మిషన్ ప్రచార రథం, మురుగునీటి నిర్వహణ, కంపోస్టు నిర్మాణం, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు వాల్ పెయింటింగ్ వంటి అంశాలను ప్రామాణికంగా
తీసుకుని దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. జనవరిలో జరిగిన సర్వే ప్రకారం ఖమ్మం జిల్లా మొత్తంగా 187 34 స్కోర్‌తో తొలిస్థానంలో నిలిచింది. జనవరిలో 89.09 స్కోర్ సాధించడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి జిల్లా ఫోర్ స్టార్ రేటింగ్ దక్కించుకుంది.
75 స్కోర్ పైబడి సాధించే జిల్లాలకు నాలుగు నక్షత్రాల రేటింగ్
తెలంగాణలోని పలు జిల్లాలకు దేశంలోనే తొలి స్థానాల్లో నిలువడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి, ఇతర కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా నీరు అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్, డిఆర్‌డిఎ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో త్రీ స్టార్, ఫోర్ స్టార్‌తో పాటు ఫైవ్ స్టార్‌తో తొలిస్థానంలో నిలవడం గర్వకారణం. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాల్సిన అవసరం ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లా, గ్రామ, మండల స్థాయిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని వారు గుర్తుచేశారు.
నాలుగు, మూడు నక్షత్రాల రేటింగ్‌లో మన జిల్లాలు
జనవరి మాసానికి సంబంధించి జాతీయస్థాయిలో ఇచ్చి న సూచీలో నాలుగు నక్షత్రాల రేటింగ్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్,పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యా ల, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. మూడు నక్షత్రాల రేటింగ్‌లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, ములు గు, నిర్మల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, కొమ రం భీమ్ ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ ,వరంగల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, ఆదిలాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, మంచిర్యాల్, మెదక్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, హన్మకొండ జిల్లాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News