Thursday, January 23, 2025

నేడు ఒకే వరుసలోకి చంద్రుడు, శుక్రుడు, శని… గ్రహ సంయోగం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు వినీలాకాశంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. మూడు గ్రహాలు…చంద్రుడు, శుక్రుడు, శని ఒకే వరుసలోకి రానున్నాయి. అవి నేడు పరస్పరం 0.4 కోణంలో ఒకదానికొకటి చేరువవుతున్నాయి. శుక్రుడు -3.9 పరిమాణంతో కాంతులు విరజిమ్మనుండగా, శని గ్రహం -0.7 పరిమాణంతో మరింత మసకబారనున్నాడు. ఇప్పుడు ఈ రెండు మకర రాశిలోకి ప్రవేశించనున్నాయి. దీన్ని గ్రహ సంయోగం అంటారు. నేటి రాత్రి చంద్రుడికి సమీపంలోనే ఈ గ్రహ సంయోగం(conjunction) కనిపించనుంది. దీన్ని టెలిస్కోప్, బైనాక్యులర్స్‌తో వీక్షించవచ్చని ఖగోళశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ ఖగోళ ఘట్టాన్ని సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీక్షించవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News