Sunday, December 22, 2024

రూ. 64,000 కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం వివిధ శాఖల అవసరాలకు సంబంధించి చేపట్టిన బడ్జెట్ కసరత్తులు చివరిదశకు చేరుకుంటున్నా యి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయరంగానికి ఆ శాఖ అధికారులు భారీ బడ్జెట్‌నే రూపొందించారు. వ్యవసాయశాఖ పరిధిలో పలు కొత్త పథకాలు అమలు చేయాల్సి వస్తున్నందున బడ్జెట్ ప్రతిపాదనలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి మొత్తం రూ.64వేలకోట్లు కోరుతూ బడ్జెట్ ప్రతిపాదనల నివేదికను రూపొందించి ఆర్ధిక శాఖకు సమర్పించారు. వ్యవసాయశాఖ రూపొందించిన బడ్జెట్‌లో సింహభాగం నిధులు పంటరుణాల మాఫీ, రైతుభరోసా పథకాలే ఆక్రమించాయి. రైతు సంక్షేమ పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అ మలు చేయబోతున్న రుణమాఫీ పథకానికి రూ.31 వేల కోట్లు, రైతుభరోసాకు రూ.23 వేల కోట్లు, ఉచిత పంటల బీమా పథకానికి రూ.3 వేల కో ట్లు, రైతుల బీమాకు రూ.1,500 కోట్ల నిధులు అవరసరమవుతాయని అ ధికారులు అంచనా వేశారు.

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కో ట్లు, ఇతర పథకాలు, కేంద్ర ప్రాయోజిత
పథకాలకు మ్యాచింగ్ గ్రాంటు, ఉద్యోగుల వేతనాలు.. అన్నింటికీ కలిపి మరో రూ.5 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కించారు. ఏడాదికి రూ.64 వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు తయారుచేసి ఆర్థికశాఖకు సమర్పించిన ట్లు సమాచారం . రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టబోయే పథకాల్లో వ్యవసాయశాఖకు సం బంధించినవే కీలకంగా ఉండడం గమనార్హం. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీల మేరకు ప్రధానం గా ఒకే ధఫా రూ.2 లక్షల రుణమాఫీ పథకానికి పెద్ద ఎ త్తున నిధులు సమకూర్చాల్సి వస్తోంది. ఇందుకోసం రూ. 31 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల కేబినెట్ భేటీ తర్వాత రుణమాఫీ లెక్కలు వెల్లడించారు. ఈ క్రమంలో వచ్చే బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరం అని ప్రతిపాదించారు.

రైతు భరోసాకూ రూ.15వేలు:
రైతుభరోసా పథకానికి కూడా బడ్జెట్ భారీగా పెరుగుతోంది. గత ప్రభుత్వం రైతుబంధు పథకంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.10 వేలు ఇస్తూవచ్చింది. సిఎం రేవంత్ సర్కారు రైతుబంధు పధకం పేరు మార్చివేసి ఆ స్థానంలో రైతుభరోసా పథకాన్ని ప్రకటించింది. అంతే కాకుండా రైతులకు ఇచ్చే పె ట్టుబడి సాయం ఏకంగా రూ.10నుంచి 15వేలకు పెం చింది. ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతుభరోసా ప్రారంభమవుతోంది. అయితే ఎకరానికి రూ.5 వేలు పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ కూడా భారీగా పెరుగుతోంది. గతంలో ఏడాదికి రూ.15 వేల కోట్ల నిధులు రైతుబంధుకు పెట్టేవారు. ఈ ప్రభుత్వం రూ.23 వేల కోట్ల బడ్జెట్‌లో ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ఈ పథకంలో ఇకపై పరిమితి వి ధించనున్నారు. గతంలో ఎంత భూమి ఉన్నా రైతుబంధు ఇవ్వగా, ఇప్పుడు కటాఫ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. విధి విధానాల ఎంపికకు మంత్రివర్గ ఉపసంఘా న్ని నియమించింది. ఏ ప్రాతిపదికన అనర్హులను తొలగించాలన్న అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ ఖరీఫ్ పంటల సీజన్ నుంచే మళ్లీ పంటల బీమా పథకం అమలు కాబోతోం ది.2018 తర్వాత రాష్ట్రంలో ఐదేళ్లుగా పంటలబీమా ప థకం అమలు కావడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చే స్తామని ప్రకటించి, ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎం-ఎ్‌ఫబీవై)లో చేరింది. అయితే మెరుగైన పంటల బీ మా అమలుచేసేందుకు కసరత్తు చేస్తోంది. రైతులపై ప్రీ మియం భారం వేయకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భ రించి రైతులకు ఉచితంగా క్రాప్ ఇన్సురెన్స్ పథకాన్ని అ మలు చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను రూ.3 వేల కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచా రం. ఇక రైతులకు కూడా రూ.5 లక్షల బీమా పథకం గ త ప్రభుత్వ హయాం నుంచి కొనసాగుతోంది. ఎల్‌ఐసీతో అనుసంధానమై రైతులకు బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతుల తరఫున ప్రీమియం చెల్లించేందుకు బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు ప్రతిపాదించింది. వ్య వసాయంలో కూళీల కొరత సమస్యను తగ్గించటం , సా గు ఖర్చులు తగ్గించటం లక్షంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి బడ్జెట్‌లో రూ.500 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిసింది.ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ధాన్యం రైతులకు ‘బోనస్’ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయనుంది.

సన్నరకాలు సాగుచేసిన రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తుంది? ఎంత సేకరిస్తారు? అనే దానిని బట్టి నిధులు అవసరమవుతాయి. టన్నుకు రూ.5 వేల చొప్పున.. ఎన్ని టన్నుల ధాన్యం సేకరిస్తే.. అన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలు పండించిన రైతులకు చెల్లించాల్సి వస్తుంది. డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే ఒక దఫా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో చర్చించారు.కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంటు ద్వారా వచ్చే ప్రాయోజిత పథకాలు,వాటి ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా లు,రాబోయే సీజన్‌కు పిలవాల్సిన క్రాప్ ఇన్సురెన్స్ టెం డర్లపై చర్చించారు. రైతు సంక్షేమ, వ్యవసాయ పథకాల కు ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, తమ హామీలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్ అవసరాలపై చర్చించనున్నారు. వ్యవసాయశాఖ అధికారులు రూ పొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన చేస్తు న్న ఆర్థికశాఖ త్వరలోనే తుది బడ్జెట్ ముసాయిదా రూ పొందించేఅవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News