Friday, December 20, 2024

2024 చంద్రయాన్ సంవత్సరం

- Advertisement -
- Advertisement -

రానున్న ఏడాదిలో 12 చంద్ర మండల యాత్రలు

గోల్డెన్ కొలరాడో : మరో పక్షం రోజుల్లో వచ్చి వాలే 2024 కొత్త సంవత్సరం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. 2024 సంవత్సరం చంద్రయాన లేదా చంద్రమండల యాత్రల సంవత్సరం కానుంది. ఈ విషయాన్ని 2023 ఏడాదికి కౌంట్‌డౌన్ల దశలో 360 ఇన్‌ఫో ఆర్గ్ అనే వినూత్న శాస్త్రీయ సాంకేతిక విషయాల కేంద్రం వెలువరించింది. మోనా ష్ వర్శిటీ దీనిని నెలకొల్పింది. 2024లో దాదాపు 12 చంద్ర మండల యాత్రలు వివిధ దేశాలనుంచి తలపెట్టారు. ఈ ఏడాది 12 నెలల కాలం లో చంద్రమండలంపై దాదాపు 12 అంతరిక్ష నౌకలు దిగడం లేదా, చంద్రయాన్ దిశలో ఉండటం జరుగుతుంది.

వీటిలో మూడు కేవలం జనవరిలోనే ఉంటాయి. జపాన్‌కు చెందిన స్లిమ్ మిషన్ జనవరి 19న చంద్రుడిపై వాలేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ అంతరిక్ష ప్రయో గ యాత్ర విజయవంతం అయితే ప్రపంచంలో చంద్రుడి వద్దకు వ్యోమనౌకలను పంపించిన ఐదో దేశం అవుతుంది. ఇప్పటివరకూ ఈ ఘనత జాబితాలో రష్యా, అమెరికా, చైనా, ఇండియా ఉన్నాయి. ఇక ప్రైవేటు కంపెనీలు కూడా చంద్రుడిపై యాత్రకు ఏర్పాట్లు చేసుకున్నాయి. నాసా కు చెందిన వాణిజ్య విభాగాలు కూడా చంద్రుడిపైకి యాత్రల క్రమంలో ముందున్నాయి. ప్రపంచస్థాయిలో పలు దేశాలకు తమ అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడు అత్యంత దగ్గరి మజిలీ అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News