Sunday, December 22, 2024

ప్రత్యామ్నాయంపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ ప్రత్యామ్నాయం దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) నేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ దిశలో ప్రతిపక్ష నేతలు చర్చిస్తున్నారని వెల్లడించారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అవసరం, 2024 సార్వత్రిక ఎ న్నికలకు ముందే ఓ కూటమి లేదా వేదిక అవసరం అన్నారు. నితీష్‌జీ, కెసిఆర్ సాబ్, మమతాజీ వంటివారు ప్రత్యామ్నాయ శక్తి కోసం తమ యత్నాలను కొనసాగిస్తున్నారని ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ద్రవ్యోల్బణం ఇంతకు ముందెన్నడూ లేని స్థాయికి చేరింది. నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతోంది, బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన పౌర హక్కులన్ని కూడా హరించుకుపోతు న్న దశలో ఇప్పటి అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి అత్యవసరం అవుతుందని, దీనిని గుర్తించే సీనియర్ నేతలతో ప్రత్నామ్నాయ శక్తి దిశలో చర్చలు జరుగుతున్నాయని అఖిలేష్ తెలిపారు. ఇది ఇప్పటి అత్యవసరం అన్నారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపిగా గెలిచారు. మామ ములాయం సింగ్ యాదవ్ స్థానం మైన్‌పురి ఈ విధంగా కోడలు కైవసమైంది. సోమవారం ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News