Thursday, December 19, 2024

నూతన సంవత్సర రాశి ఫలాలు (01-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. వాహన యోగం. శ్రమఫలిస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు కొనుగోలు.పుణ్య క్షేత్రాలు సందర్షిస్తారు.

వృషభం – కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా వుంటాయి.నూతన ఒరవడి ఏర్పరుచుకోవాలని నిర్ణయించుకుంటారు.

మిథునం – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్యం,వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. సోదరుల నుండి సహాయ, సహకారాలు అందుతాయి.

కర్కాటకం- ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆభరణాలుకొనుగోలు చేస్తారు. బంధువులను కలుస్తారు.

సింహం – పనులలో జాప్యం జరిగి చికాకులు పెడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలలో స్వల్ప స్థాన మార్పులు వుంటాయి. బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్తఅవసరం.విలువైన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగం.

కన్య – మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కలిసివస్తాయి.గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు అనుకూలమైనకాలం. వస్తులాభం

తుల – చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు.వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

వృశ్చికం – కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సన్నిహితులనుండి విలువైన సమాచారం అందుతుంది. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. వాహనయోగం. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మానసికంగా ఆనందంగా గడుపుతారు.

ధనున్సు – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. పట్టుదల పెరుగుతుంది. ఆధ్యత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. స్వల్ప ధన, వస్తు లాభం.

మకరం – కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి సాయం అందుకుంటారు. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొంత మానసిక శ్రమ ఏర్పడుతుంది.

కుంభం – చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఆహారపు అలవాట్లను ఎంచుకుంటారు. దైవచింతన కలిగి వుంటారు.

మీనం – మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు,వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News