Friday, December 20, 2024

2024 గగన్‌యాన్ నన్నాహక కాలం

- Advertisement -
- Advertisement -

ఇస్రో అజెండాతో ఛైర్మన్ సోమనాథ్

శ్రీహరికోట : వినూత్న ప్రయోగంతో ఆరంభమైన 2024 సంవత్సరం పట్ల భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఉజ్వల ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌కు సన్నాహక, ముందస్తు సంసిద్ధతల సంవత్సరంగా నిలుస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ సోమవారం ఇక్కడ తెలిపారు. బెంగళూరు ప్రధాన కేంద్రపు ఇస్రో భారతదేశపు అంతరిక్ష ప్రయోగాల విజయపరంపరను కొత్త ఏడాది ఆరంభవేళ కొనసాగించింది. సోమవారమే శ్రీహరికోట నుంచి పిఎస్‌ఎల్‌వి సి58 రాకెట్ ద్వారా తొట్టతొలి ఎక్స్ రే పొలారిమీటర్ శాటిలైట్‌ను (ఎక్స్ పోశాట్)ను విజయవంతంగా కక్షలోకి పంపించింది. ఈ ఘట్టం నేపథ్యంలో సోమనాథ్ మీడియాతో మాట్లాడారు.

2024 ఇస్రో అజెండాను మీడియా ముందుంచారు. ఈ ఏడాది అంతా పలు ప్రయోగాల నిర్వహణ ఉంటుంది. కనీసం 12 నుంచి 14 వరకూ మిషన్లు ఉంటాయని వివరించారు. ఇక 2025లో జరుపతలపెట్టిన గగన్‌యాన్‌కు ఈ ఏడాది అంతా సన్నాహాక వేదిక అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే గగన్‌యాన్‌కు సంబంధించి కొన్ని కీలక దశలను విజయవంతంగా నిర్వర్తించారు. అబార్ట్ మిషన్ లేదా టివి డి1ను అక్టోబర్‌లో నిర్వర్తించారు. ఈ క్రమంలో వరుసగా నాలుగు ఇటువంటి పరీక్షలు ఉంటాయి.

ఈ ఏడాది రెండింటిని జరిపించాలని లక్షంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంతరిక్ష విభాగం కార్యదర్శి హోదాలో కూడా ఉన్న సోమనాథ్ గగన్‌యాన్‌కు సంబంధించిన పూర్తి స్థాయి సన్నద్దతకు అవసరం అయిన ఏర్పాట్లకు రంగం సిద్ధం చేయిస్తున్నారు. ఇక ఇస్రో కొత్త సంవత్సరంలో తలపెట్టిన ఇతర కార్యక్రమాలలో ప్రధానమైనది నిస్సార్ కోసం జిఎస్‌ఎల్‌వి ప్రయోగం. ఈ ఏడాదే జిఎస్‌ఎల్‌వి తొలి వాహకనౌకను ఇన్సాట్ 3డిఎస్‌తో ప్రయోగిస్తారు. సంబంధిత వాహకనౌక ఇప్పటికే సిద్ధమైందని సోమనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News