Monday, March 3, 2025

ఆస్కార్ అవార్డు విజేతలు వీరే.. భారత్‌కు నిరాశ

- Advertisement -
- Advertisement -

లాస్ ఏంజిల్స్: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 97వ ఆస్కార్ అవార్డుల ప్రధాననోత్సవం డాల్బీ థియేటర్‌లో జరుగింది. ఈ వేడుకలకు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలు విభాగాల్లోని అవార్డులను ప్రధానం చేశారు. అయితే ఈ ఏడాది లైవ్ యాక్షన్ విభాగంలో మన దేశం నుంచి నామినేట్ అయిన అనూజ చిత్రానికి అవార్డు లభించక నిరాశ ఎదురైంది. ఈ ఏడాది అవార్డు గెలుచుకున్న వాళ్ల వివరాలు చూద్దాం…

ఉత్తమ చిత్రం : అనోరా
ఉత్తమ నటుడు : అడ్రియన్ నికోలస్ బ్రాడి (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి : మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ (అనోరా)

ఉత్తమ దర్శకుడు : సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కల్కిన్ ( ఏ రియల్ పెయిన్)
ఉత్తమ సహాయనటి : జో సాల్దానా (ఎమిలియా పెరెజ్)
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : కాన్ క్లేవ్
ఒరిజినల్ స్క్రీన్ ప్లే : అనోరా
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : ఫ్లో
బెస్ట్ యానిమెటెడ్ షార్ట్ ఫిల్మ్ : ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్
క్యాస్టూమ్ డిజైనర్ : పాల్ తాజేవెల్ (విక్డ్)
ఉత్తమ ఎడిటింగ్ : సీన్ బీకర్ (అనోరా)
మేకప్, హెయిర్ స్టైలింగ్ : పియర్ ఒలివియర్ పర్సిన్, స్టీఫెన్ గులియన్, మారిలిన్ స్కార్సెల్లి (ది సబ్ స్టాన్స్)
ఒరిజినల్ సాంగ్ : ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ : విక్డ్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : నో అదర్ ల్యాండ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ : ది బ్రూటలిస్ట్
ది బెస్ట్ సౌండ్ : డ్యూన్ పార్ట్ టు
విజువల్ ఎఫెక్ట్స్ : డ్యూన్ పార్ట్ టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News