అఖిల భారత కోటాకు 230 సీట్లు
10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1285
రెండో వారంలో మెడికల్ కౌన్సెలింగ్
ఇడబ్లూఎస్ కోటాలో 203 ఎంబిబిఎస్ సీట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 202122 వైద్య విద్య సంవత్సరానికి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఇడబ్ల్యూఎస్) కోటాలో 203 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులో వచ్చా యి. గాంధీ, కాకతీయ వైద్య కళాశాలల్లో 50 చొప్పున, రిమ్స్ ఆదిలా బాద్, నిజామాబాద్ కళాశాలల్లో 20 చొప్పున, మహబూబ్ నగర్, సిద్దిపే ట కళాశాలల్లో 25 చొప్పున ఎంబిబిఎస్ సీట్లు మంజూరు కాగా, ఇఎస్‌ఐ మెడికల్ కాలేజీలో 13 సీట్లు మంజూరైనట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యా లయం తెలిపింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 10 ప్రభు త్వ వైద్య కళాశాలల్లో 1,285 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా సీట్లు ఉన్నా యి. వీటిలో 15 శాతం అంటే సుమారు 230 సీట్లను నేషనల్ పూల్ (అ ఖిల భారత కోటా)లోకి ఇస్తారు. గాంధీ, కాకతీయ కళాశాలల్లో 30 చొప్పున, ఉస్మానియాలో 37, రిమ్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ వైద్య కళాశాల, ఇఎస్‌ఐ కళాశాలల్లో 15 చొప్పున, మహబూబ్ నగర్, సిద్ది పేట, నల్గొండ, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 22 చొప్పున సీట్లను జాతీయ కోటాలో భర్తీ చేయనున్నారు.
రాష్ట్రంలోని 29 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1,450 ఎంబిబిఎస్ సీట్లు, 4 మైనారిటీ వైద్యకళాశాల ల్లో 330 సీట్లు ఉన్నాయి. వీటిలో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనుండగా, మిగిలిన సగం సీట్లలో 70 శాతం యాజమాన్య కోటా కింద, 30 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కేటాయిస్తారు. మెడికల్ కౌన్సిలింగ్‌లో ముందు అఖిల భారత కోటాలో 15 శాతం సీట్లు, తర్వాత రాష్ట్ర కోటాలో ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. ఆ తర్వాత యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేస్తారు.
డాటా అందిన వెంటనే అడ్మిషన్లకు నోటిఫికేషన్
రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల రెండవ వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. వైద్య విద్యలో ప్రవేశాలకు దేశవ్యాప్ంతగా నిర్వహించిన నీట్ 2021 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఫలితాలు సోమవారం 1) విడుదల య్యాయి. రాష్ట్రంలో మెడికల్ సీట్లపై స్పష్టత వచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నుంచి నీట్‌లో అర్హత సాధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డాటా అందిన వెంటనే అడ్మిషన్లకు నోటిఫికే షన్ జారీచేస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు కాళోజీ ఆరోగ్య
డిసెంబర్‌లో తరగతులు ప్రారంభం
ఏటా ఆగస్టు 1 నుంచి వైద్య విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభ మవుతుండగా, గత ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆరు నెలలు ఆలస్యంగా ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది కూడా నీట్ ఫలితాలు ఆలస్యంగా వెలువడటంతో కౌన్సెలింగ్ ఆల స్యమవుతోంది. రెండో వారంలో మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తే డిసెంబర్ లేదా జనవరిలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.