Wednesday, January 22, 2025

ఇంకా తేరుకోని వయనాడు.. 206 మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

కొనసాగుతున్న సహాయక చర్యలు
ఉత్తరాఖండ్‌లోనూ వరదలు.. కేదార్‌నాథ్‌లో
చిక్కుకున్న తెలుగు యాత్రికులు

తిరువనంతపురం : ప్రకృతి విలయం బాధిత వయనాడ్‌లో అన్వేషణ, రక్షణ కార్యక్రమాలు తుది దశల్లో ఉన్నాయని, అయితే, 206 మంది జాడ ఇంకా తెలియరావడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం వెల్లడించారు. విజయన్ తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, చలియార్ నదిలో నుంచి వెలికితీసిన మృతదేహాలు, శరీర భాగాలను గుర్తించడం కష్టంగా ఉందని చెప్పారు. ‘ఇప్పటి వరకు 215 మృతదేహాలు వెలికితీశారు.

వాటిలో 87 మహిళలవి, 98 పురుషులవి, 30 పిల్లలవి. ఇంత వరకు 148 మృతదేహాల అప్పగింత జరిగింది. 206 మంది జాడ ఇంకా తెలియరావడం లేదు. 8 1 మంది గాయపడ్డారు. వారికి వివిధ ఆసుపత్రుల్లో చి కిత్స జరుగుతోంది’ అని విజయన్ తెలియజేశారు. 67 మృతదేహాలను ఇంకా గుర్తించవలసి ఉందని, పంచాయతీలు అంత్యక్రియలు నిర్వర్తిస్తాయని ఆయన చెప్పారు. ‘అన్వేషణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, ఎన్‌డిఆర్‌ఎఫ్, అటవీ శాఖ, పోలీస్, భారత సై న్యం, తమిళనాడు వాలంటీర్ల నుంచి 1419 మంది ఆ కా ర్యక్రమాల్లో పాల్గొంటున్నారు’ అని ఆయన తెలిపారు.

పునరావాస చర్యలకు 3 కోట్లు: మోహన్‌లాల్
ఇది ఇలా ఉండగా, భారత ప్రాదేశిక సైన్యం (టిఎ)లో లె ఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న ప్రముఖ నటుడు మోహన్‌లాల్ శ నివారం వాయనాడ్ చేరుకుని, సైనిక యూనిఫామ్ ధ రించి, విలయ బాధిత ప్రాంతాలను సందర్శించారు. పునరావాస కార్యక్రమాలకు రూ. 3 కోట్లు అందజేస్తానని వా గ్దానం చేశారు. మెప్పడిలో సైనిక శిబిరాన్ని సందర్శించిన మోహన్‌లాల్ ఆఫీసర్లతో కొద్ది సేపు చర్చలు జరిపి, ఇతరులతో కలసి విలయ బాధిత ప్రాంతాలకు వెళ్లారు. స్వ యంగా చూసిన తరువాతే ఆ విలయం ఎంత తీవ్రమైనదో అర్థం కాగలదని ఆయన మీడియాతో అన్నారు.

వయనాడ్‌లో బాధితులకు 100 ఇళ్లు నిర్మిస్తాం: సిద్ధరామయ్య
ప్రకృతి విలయం వల్ల నష్టపోయిన వయనాడ్‌లో బాధిత ప్రజల కోసం తమ ప్రభుత్వం వంద ఇళ్లను నిర్మిస్తుందని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య శనివారం ప్రకటించారు. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన దృష్టా కేరళ పట్ల సంఘీభావం ప్రకటిస్తున్నామని ‘ఎక్స్’ పోస్ట్‌లో సిద్ధరామయ్య తెలియజేశారు. ‘మా మద్దతు ఉంటుందని సిఎం పినరయి విజయన్‌కు హామీ ఇచ్చాను. బాధితుల కోసం 100 ఇళ్లను కర్నాటక నిర్మిస్తుందని ప్రకటించాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News