- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో ఇంతవరకు కరోనా జెఎన్.1, దాని తెగలకు సంబంధించిన కేసులు 2,083 వరకు నమోదయ్యాయని ఇన్సాకాగ్ ( ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్స్ కన్సార్టియమ్ ) సోమవారం వెల్లడించింది. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జెఎన్.1 జన్యుపరమైన సార్స్ కొవి2 కేసులు 814 నమోదు కాగా, దాని ఉప తెగల కేసులు 943 వరకు నమోదయ్యాయని ఇన్సాకాగ్ వివరించింది. వీటిలో జెఎన్1.11 కేసులు 244 కాగా, మిగతావి ఉప తెగ జెఎన్.1 కేసులు. కరోనా జెఎన్.1 సబ్‌వేరియంట్ ఇంతకు ముందు బిఎ.2.86 సబ్ లీనియేజెస్ లోని వేరియంట్ ఆఫ్ ఇంటెరెస్ట్ (విఒఐ)గా వర్గీకరించడమైంది.ఇది వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ దీని ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
- Advertisement -