Monday, December 23, 2024

20,862 పాలిటెక్నిక్ డిప్లొమా సీట్లు భర్తీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 114 కళాశాలల్లో 20,862 పాలిటెక్నిక్ డిప్లొమా సీట్లు కేటాయించారు. తుది విడత సీట్ల కేటాయింపు తర్వాత 8,748 సీట్లు ఖాళీగా మిగిలాయి. రాష్ట్రంలోని 57 ప్రభుత్వ కాలేజీలలో 11,461 (83.7 శాతం) సీట్లు భర్తీ కాగా, 57 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 15,918(59.05 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి.

ఇడబ్లూఎస్ కోటా కింద 648 సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ వరకు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు ఈ నెల 16లోగా సీట్లు పొందిన కళాశాలలో తమ ఒరిజినల్ టిసి, మిగతా జిరాక్స్ సర్టిఫికెట్ల సెట్లు సమర్పించి రిపోర్టు చేయాలి. ఈనెల 15, 16 తేదీలలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ఒరియెంటేషన్ తరగతులు ప్రారంభమవుతాయని, ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు టిజి పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News